వేముల ఎల్లయ్యవరంగల్ జిల్లా జనగామ తాలూకా లింగాల ఘనపురంలో, 1973 జూలై 06లో జన్మించాడు.  వేముల ఎల్లయ్య అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులు. చిన్నప్పటినుండి చదువు మీద మమకారంతో కష్టపడి చదివి ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేశారు. ఈయన రాసిన కక్కా నవల 2024 సంవత్సరంలో నోబెల్ కు నామినేట్ అయింది . వేముల ఎల్లయ్య దళితవాద తెలుగు సాహిత్యంలో దృవతార. వేముల ఎల్లయ్య రాసిన కక్క నవల ప్రత్యేకమైనది. మాదిగల వాడుక భాషను నవలలో సమర్ధంగా వినియోగిస్తూ, వారి సాంస్కృతిక, సామాజిక జీవన విధానాన్ని రచయిత చిత్రించారు. ఈ నవలలో కులవృత్తి చుట్టూ తిరుగుతూ, దళిత జీవితాన్ని చిత్రిస్తుంది." మరో దళితవాద చైతన్యాన్ని, స్పృహను కలిగించే నవల "సిద్ధి". "ఈ నవల దళితవాద సామాజిక సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది." వేముల ఎల్లయ్య తమ సాహిత్యంలో మాదిగ జాతిపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవమానాలను, హీనత్వంతో అమానుషంగా చూడబడుతున్న స్థితిని, మాదిగ సంస్కృతి, ఆచార వ్యవహరాలను తన కక్క నవలలో అతిసులభమైన తెలంగాణ భాషలో సాధారణ ప్రజలకు కూడా అర్థం అయ్యేవిధంగా వివరించాడు. ఎల్లయ్య దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మకమైన నవల, కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు, వ్రాస్తు, తెలుగు సాహిత్యం, దళిత సాహిత్యం లలో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం, మాదిగల సాహిత్యంలో తన దైన ప్రత్యేక శైలి రాస్తూ చాల మందికి స్ఫూర్తినిస్తూ సాహిత్య రంగంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తీసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు దళిత (మాదిగ) జీవితాన్ని అవపొసన పట్టిన  వేముల ఎల్లయ్య మాదిగ జాతి యొక్క భాష, సంస్కృతి, చరిత్రలపై నితంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సభలు, సాహిత్య సమీక్షలు, సాహిత్య పత్రికలతో మాదిగ సమాజాన్ని తనదైన శైలిలో చైతన్య పరుస్తున్నాడు. ఈ రోజు కక్క నవల ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన యునివర్సిటీలో పరిశోధన పత్రంగా గుర్తించబడింది. మాదిగ జాతి యొక్క ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరగరాయ బడతాయనడానికి వేముల ఎల్లయ్య .వేముల ఎల్లయ్య  "గోసంగుల జీవిత చరిత్ర" పైన అధ్యయనం చేశారు.