డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు


టెట్ లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే ఛాన్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

నేడు టెట్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించింది. 

ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.