ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం  కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగుల‌కు సూచించారు. ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే త‌లెత్తే చ‌ట్ట ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప్ర‌భుత్వం త‌గు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన‌ట్లు త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే నిరుద్యోగుల‌కు న్యాయం జ‌రగ‌క‌పోగా..  ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా  రద్దయ్యే ప్రమాదముందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు అని విద్యార్ధి నాయకుడు చెనగాని దయాకర్  అన్నారు . 
నిరుద్యోగులకు  ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్ప‌టికే 28,942 ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టింద‌ని గుర్తు చేశారు.  ఏళ్ల‌కు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామ‌కాల‌కు ఉన్న కోర్టు చిక్కుల‌న్నింటిని అధిగ‌మించింద‌ని చెప్పారు.  జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్ష‌లు నిర్వహించి, ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామ‌న్నారు. ప‌రీక్ష‌ల తేదీల విష‌యంలో టీజీపీఎస్‌సీ, విద్యాశాఖ‌తో చ‌ర్చించి త‌దుప‌రి  నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం వారికి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు . టీజీ గ్రూప్ 2 విషయాన్ని 
.. డూ ఆర్ డై నెట్వర్క్స్  వారు  ప్రశ్నించగా  టీజీ గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం ఉందని తెలిపారు .