(Dt. 08.07.2024)

టీ.జీ గ్రూప్-1 ప్రిలిమ్స్ లో జీ.వో 55 తొలగింపుకు కారణాలు ఇవే_! 

ప్రస్తుత ప్రభుత్వం(2024) జీ.వో 55 తీసివేసి జీ.వో 29 ఇవ్వడానికి ప్రధాన కారణం ఇదే_! 
సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కు జీ.వో 55 విరుద్ధంగా ఉండడం, ముందుగా గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం (2023-2024) TG గ్రూప్-1 ఇక ముందుకు సాగదని దీనికి అడ్డంకిగా ఉన్న జీ.వో 55 ని తీసివేయాలని ఆలోచించి దాని ప్లేస్ లో జీ.వో 29 తీసుకురావడం జరిగింది, దీనికి ప్రధాన కారణం 2015లోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉండడం.
*బాలోజీ బడావత్ వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు-2015 లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ (2015) అసలు ఏం చర్చించింది దాని సారాంశం ఏంటి_? 
I,భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కేవలం అపాయింట్మెంట్స్ లో మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తుంది, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ లో కాదు. 
II, అంతేకాకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 335 ,దేశంలో ఏ రిక్రూట్మెంట్ నిర్వహించిన 'మెరిటోరియస్ క్యాండిడేట్స్' కి అన్యాయం జరగకుండా రిక్రూట్మెంట్ నిర్వహణ ఉండాలి. 
III, TG/AP గ్రూప్-1 ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామినేషన్లలో రిజర్వేషన్ లేకుండా ఓరల్ గా తీసుకున్నప్పుడు ఏదైనా తరగతికి సరిపడా ఆ తరగతి అభ్యర్థులు లేకపోతే మళ్లీ ఆ తరగతి అభ్యర్థులకు సరిపడా ఎక్స్ట్రా అభ్యర్థులను కూడా పిలవాలి, ఉదాహరణకు ఒక నోటిఫికేషన్ మొత్తంలో రిజర్వేషన్ కలుపుకొని 100 పోస్టులు ఉన్నప్పుడు 100X50=5000 మందిని పిలవాల్సి ఉంటుంది, దీనిలో ఎస్సీ కేటగిరీకి లేదా ఎస్టీ కేటగిరి అభ్యర్థులు సరిపడా ఎంపిక కానప్పుడు సరిపడా ఎక్స్ట్రా తీసుకోవాల్సి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఎస్సీ కేటగిరీలో ఐదు పోస్టులు ఉన్నాయనుకుంటే 5X50=250 మందిని పిలవాలి, 5000 మందిలో 200 మంది ఉన్నారు అని అనుకుందాం అప్పుడు ఇంకొక 50 మందిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ఇలా ఏ కేటగిరీలో తక్కువ ఉంటే వాళ్ళని సరిపడా పిలవాల్సి ఉంటుంది .  అప్పుడు 5000 కన్నా కూడా ఎక్కువ సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కేవలం రిజర్వేషన్ల వారిగా పిలిస్తే మాత్రం ఈ సంఖ్య 5 వేలకు మించి పెరగదని స్పష్టమవుతుంది, కాబట్టి ప్రభుత్వం మెరిటోరియస్ క్యాండిడేట్స్ కి అన్యాయం జరగకుండా కేటగిరి రిజర్వేషన్ల వారికి కూడా అన్యాయం జరగకుండా అనుకున్న దానికంటే ఎక్కువ కూడా పిలవడం పిలవడం కోసం దృష్టిలో పెట్టుకొని జీవో 29 జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల మెరిటేరియస్ క్యాండిడేట్స్ కానీ, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి కానీ నష్టం వాటిల్లదు అనేది స్పష్టం అవుతుంది.

_ వెబ్ సైట్ ని సందర్శించినందుకు కృతజ్ఞతలు 
ఇట్లు 

మీ, 
సందీప్ ఇమ్మడి, 
డు ఆర్ డై నెట్వర్క్, 
మేనేజింగ్ డైరెక్టర్,