టీజీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎక్సమినేషన్ - 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ విశ్లేషణ ఇందులో పొందుపరుస్తున్నాము, ఇక్కడ అంశాలు పూర్తిగా రచయిత వ్యక్తి గతం మాత్రమే, కానీ నిపుణులు విశ్లేషకులు, అభ్యర్థులు ,సలహాదారుల నుండి సమాచారం సేకరించిన తర్వాత మాత్రమే, వెబ్సైటు లో వ్యాసాలు రాయడం జరుగుతుంది .  

నిన్నటి రోజు జరిగిన అనగా 09/06/2024 రోజు జరిగిన టీజీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎక్సమినేషన్ - 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇంతే అని చెప్పడంలో మా రచయిత కు అనేక కారణాలు కలవు . అందులో ప్రధానమైనవి . 

1. ప్రీవియస్ ఎక్సమినేషన్లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ సందర్భాలు .

2. ప్రభుత్వ పాలసీ&రిజర్వేషన్లు ప్రకటించిన విషయాలు . 

3. అభ్యర్థి ప్రిపరేషన్ ఎక్సమినేషన్లో స్పందించే తీరు & పేపర్ కాఠిన్యత 

4. 2016 నుండి డుఆర్ డై ఛానెల్ ద్వారా రచయిత బాలాజీ చిర్రబోయిన గారు అందించిన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మార్క్స్ అనాలసిస్ అనుభవం 

1. ప్రీవియస్ ఎక్సమినేషన్ సందర్బాల్లో వచ్చిన కట్ అఫ్ మార్కుల సరళి పరిశిలిస్తే తెలుగు రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో 2011, 2022 సంవత్సరాలలో రెండు సందర్బాల్లో నోటిఫికేషనులు కనిపిస్తున్నాయి. దురదృష్ట వశాత్తు ఈ రెండు 2011/2022 నోటిఫికేషన్లో కూడా ప్రిలిమ్స్ ఎక్సమ్ రెండు, మూడు సార్లు నిర్వహించడం జరిగింది . వాటిలో భాగంగా రచయిత అనుభవం దృష్ట్యా ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 2024 అందించడం జరుగుతుంది .2011 గ్రూప్-1 ప్రిలిమ్స్ (2) సార్లు (2011,2016 ) ఎక్సమ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందుకు గల కారణం ప్రిలిమినరీ కీ సరిగ్గా ఇవ్వని కారణంగా 2011లో ప్రిలిమ్స్ & మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా అయిపోయినప్పటికీ సుప్రీం కోర్ట్ ఎగ్జామినేషన్ ని రద్దు చేయకుండా రెండవసారి మళ్లీ 'కీ'సవరణతో లిస్ట్ పెట్టడం జరిగింది

1.2011 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కులు 72 (ప్రిలిమనరీ రిజర్వేషన్లు పాటించలేదు, ఈ మార్కులు ఒక అంచనా మాత్రమే ) . 

2.2016 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కులు 71 (ప్రిలిమనరీ రిజర్వేషన్లు పాటించలేదు,ఈ మార్కులు ఒక అంచనా మాత్రమే ) . 

2022 గ్రూప్-1 ప్రిలిమ్స్ (3) సార్లు ( 2022, 2023,2024 ) ఎక్సమ్ కండక్ట్ చేయడం జరిగింది,ఇందుకు గల కారణం ఒక సారి పేపర్ లీకేజ్ కారణం కాగా రెండవ సారి బయో మెట్రిక్ తీసుకొని కారణంగా హై కోర్ట్ ఉత్తర్వుల మేరకు రద్దు చేయడం జరిగింది . 

1 .2023 మొదటి సారి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కులు 74,76 అని రచయిత గారి ఒక అంచనా . (ప్రిలిమనరీ ఎక్సమినేషన్ లో రిజర్వేషన్లు పాటించారు,స్టేట్ వైడ్ క్యాడర్ లో ఉన్న టి ఎస్ గ్రూప్-1 లో ఉన్న పోస్ట్ లని మల్టీ జోన్ I,II చేయడం వలన రెండు(74)(76) ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కులు కనిపిస్తున్నాయి ) . 

2. 2023 రెండవ సారి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉండేది, ఎందుకంటే పేపర్ కాఠిన్యత ఎక్కువగా ఉన్నది , కానీ ఎక్సమినేషన్ హై కోర్ట్ ఉత్తర్వుల మేరకు కాన్సల్ చేయడం వలన ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. (ప్రిలిమనరీ ఎక్సమినేషన్ లో రిజర్వేషన్లు పాటించాల్సి వచ్చేది ఎందు కంటే ప్రభుత్వం నోటిఫికేషన్ లో జి ఓ నెంబర్ 55 /2022 చెప్పినది . ) 

3 .2024 మూడవ సారి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కుల అంచనా కొరకు ఈ వ్యాసం చదవడం జరుగుతుంది ? (ప్రిలిమనరీ ఎక్సమినేషన్ లో రిజర్వేషన్లు పాటించడం జరగదు, ఎందుకంటే బాలాజీ బడావత్ v/s స్టేట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు లో ప్రిలిమినరీ దశలో రిజర్వేషన్లు పాటించడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్టు తీర్పు ఉండటం వలన ప్రభుత్వం జీవో 55 తీసేసింది కావున ప్రిలిమనరీ ఎక్సమినేషన్ లో రిజర్వేషన్లు పాటించడం జరగదు) 

 ప్రభుత్వ పాలసీ , రిజర్వేషన్లు ప్రకటించిన విషయాలు .( హరి జంటల్ అమలు లేక పోవడం జీవో 55 ఉండడం )

మహిళా అభ్యర్థులకు ఇచ్చిన వర్టికల్ రిజర్వేషన్ కారణంగా 1996 నుండి జనరల్ అభ్యర్థులకు జరుగ వలసిన న్యాయం జరుగలేదు, సుప్రీం కోర్టు తీర్పు రాజేష్ కుమార్ దరియా v/s రాజస్థాన్ ప్రకారం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరిజంటల్ రిజర్వేషన్ అమలుపరచింది . కానీ 2023, గ్రూప్-1 ప్రిలిమ్స్ లో హరిజంటల్ రిజర్వేషన్ అమలు కారణంగా పోస్ట్ లలో బ్రేక్ అప్ ఇవ్వడం వలన అవి మహిళా అభ్యర్థులకు కేటాయించడం, అదే కాకుండా బ్రేక్ అప్ - వేకేన్సిస్ కి జీవో 55 అమలు చేయడం మొదటి సారి గ్రూప్-1ప్రిలిమనరీ - 2024 ఎక్సమ్ కట్ ఆఫ్ లు 76 వరకు వెల్లడం జరిగింది . అంతే కాకుండా కొన్ని రిజర్వేషన్ ల వారికీ ప్రిలిమనరీ ఎక్సమినేషన్ లో రిజర్వేషన్లు పాటించడం వలన (58) వరకు కూడా వచ్చినట్లు కొంత మంది విశ్లేషకుల అభిప్రాయం . 

ఈ సారి గ్రూప్-1లో దాదాపుగా (60) పోస్ట్ లు పెరగడం కూడా కట్ ఆఫ్ మార్కులు తగ్గడానికి ఉన్న మరొక అవకాశం . అంతే కాకుండా పేపర్ నిర్మాణంలో సంక్లిష్ట ,సరళ కాఠిన్యత కూడా కట్ ఆఫ్ మార్కులు తగ్గడానికి అవకాశం ఉన్నది . 

ముగింపు :

ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మార్క్స్ 63 నుండి 68 వరకు 2024

 అనేక అంశాలు పరిశిలించిన పిమ్మట రచయిత అభిప్రాయంలో ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మార్క్స్ 63 నుండి 68 వరకు ఉండే అవకాశం ఉంది TG గ్రూప్ 1 నోటిఫికేషన్- 2024 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లో 563 పోస్టులకు గాను ఒక పోస్టుకు (50) మందిని తీసుకుంటే మొత్తం ఇప్పుడు మెయిన్స్ కోసం ఎంపిక చేయాల్సిన అభ్యర్థుల సంఖ్య-28,150 కానీ లీస్టుని ఎంపిక చేసేటప్పుడు ఒకటి నుంచి మెరిటోరియస్ క్యాండిడేట్స్ ని తీసుకుంటూ ర్యాంకింగ్లో తీసుకుంటారు కాబట్టి ఇందులో ఏ వర్గమైన అభ్యర్థులు రానట్లయితే వారికోసం మళ్లీ కింది నుంచి అంటే 29 వేల సంఖ్య దాటిన తర్వాత రానటువంటి అభ్యర్థి వర్గపు అభ్యర్థుల కోసం మళ్లీ ఒక పోస్టుకు పదిమందిని పిలవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మరికొంతమందిని పిలిచే అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా 30000 వరకు అభ్యర్థులను పిలవడానికి అవకాశం ఉంటుంది ఇది మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి మల్టీ జోనల్ వైస్ గా మాత్రమే పిలవడానికి అవకాశం ఉంటుంది స్టేట్ వైడ్ గా ఈ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉండదు.